TG : స్కూళ్లకు కీలక ఆదేశాలు

TG : స్కూళ్లకు కీలక ఆదేశాలు
X

ఈనెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థుల ట్రాన్స్ పోర్ట్ పై స్కూళ్ల వాహనాలు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలని రవాణాశాఖ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 25,677 విద్యాసంస్థల బస్సులు ఉంటే ఇప్పటి వరకు 17,020 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాయని, మిగిలిన 8,657 బస్సులు కూడా సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలని సూచించారు.

15 ఏండ్లు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగొద్దని సూచించారు. ఆ వాహనాల్లో విద్యార్థులను రవాణా చేస్తే సీజ్‌ చేయడమే కాకుండా యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాసంస్థల వాహనాల నిర్వహణ బాధ్యత ఆయా యాజమాన్యాలదే అని తెలిపారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకొని వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అన్ని జిల్లాల రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

Tags

Next Story