TG : ఆకునూరి మురళికి కీలక పదవి?.. బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్?

TG : ఆకునూరి మురళికి కీలక పదవి?.. బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్?

నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటికే 36 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో నాలుగు కమిషన్లకు పాలక వర్గాల నియామ కంపై కసరత్తు పూర్తి చేసింది. ఒకటి, రెండు రోజుల్లో నియామకాలను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇటీవల అత్యవసరంగా చేపట్టాల్సిన నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు.

ముఖ్యమైన నాలుగు నామినేటెడ్ పోస్టులపై చర్చించారు. ఏకాభిప్రాయం అనంతరం నివేదికను ఎఐసీసీకి సమర్పించారు. అధిష్టానం కూడా ఆమోదించినట్లు తెలిసింది. ప్రధానంగా రైతు కమిషన్ చైర్మన్ గా పార్టీ కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, విద్యాకమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, బీసీ కమిషన్ చైర్మన్ గా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. అదే విధంగా సమాచార హక్కు చట్టం కమిషన్కు ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకంపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Tags

Next Story