TG : భట్టి, ఉత్తమ్, సీతక్కలకు హైకమాండ్ కీలక బాధ్యతలు

TG : భట్టి, ఉత్తమ్, సీతక్కలకు హైకమాండ్ కీలక బాధ్యతలు
X

తెలంగాణ మంత్రులకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాల్లో కీలక బాధ్యతలను కేటాయించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా వారిని నియమించింది. మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మందిని నియ మించగా.. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు. జార్ఖండ్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధార్ రంజన్ చౌదరిని పరిశీలకులుగా నియమించారు. ఏఐసీసీ పరిశీలకులుగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఉన్నారు. వార్ రూమ్ లో వంశీ చంద్ కూడా ఉన్నారు.

Tags

Next Story