TG : రేపే కీలక పథకాలు ప్రారంభం.. ఇవాళ సీఎం కీలక సమావేశం

TG : రేపే కీలక పథకాలు ప్రారంభం.. ఇవాళ సీఎం కీలక సమావేశం
X

జనవరి 26 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇవాళ కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో సిఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నెల 26వతేదీ నుండి అమలు చేయబోతున్న పథకాలపై సంబంధిత మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం.బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులంతా పాల్గొంటారు. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అమలుకానున్నాయి.

Tags

Next Story