Khairatabad : ఈసారి ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం విశేషాలివే..

ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నిమజ్జన ప్రక్రియ పూర్తికావలసి ఉండగా.. అంతకన్నా అరగంట ముందుగానే పూర్తయింది. ఖైరతాబాద్ మహాగణపతి 11 రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్నాడు. మంగళవారం ఉదయం కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభయాత్ర ప్రారంభించారు. గణపతి బప్పా మోరియా అంటూ వేలాది మంది భక్తుల నినాదాల మధ్య సప్తముఖ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యింది.
70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఖైరతాబాద్ విగ్రహం.. ఈసారి ఏడు ముఖాలతో దర్శనమిచ్చారు. ఇక్కడ విగ్రహాల ఏర్పాటు చేసే సంప్రదాయం మొదలై 70 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఈసారి 70 అడుగులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా మధ్యాహ్నం 1.39 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది.
క్రేన్ నెంబర్ నాలుగు వద్ద... ఖైరతాబాద్ విగ్రహాన్ని.. గంగమ్మ ఒడికి చేర్చారు. ఈసారి ఖైరతాబాద్ గణేశ్ పూర్తిస్థాయిలో నీళ్లలో మునగడం చాలామందిని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. అద్భుతం అనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com