Khairatabad Ganesh : 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు.. విశేషాలు ఇవే

ఖైరతాబాద్ బడా గణేశ్ ఈ సారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. 69 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి భూమి పూజ చేశారు. బడా గణేష్ రూపాన్ని ఉత్సవ సమితి సభ్యులు విడుదల చేశారు. స్వామి వారికి కుడి వైపు జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవుడు, ఎడమ వైపున లలితా త్రిపుర సుందరి, గజ్జలమ్మ దేవి విగ్రహాలుంటాయి. ఇవాళ నిర్వహించిన కర్రపూజకు ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. 71 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడి గణేశుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com