KHAMMAM: పెరుగుతున్న..గుండెపోటు మరణాలు

ఖమ్మంలో గుండెపోటుతో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. వరుసగా రెండ్రోజుల్లోనే ఇద్దరు గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇవాళ జిమ్‌కి వెళ్లి వచ్చాక శ్రీధర్ అనే యువకుడు హఠాత్తుగా మృతి చెందారు. బాలపేటకు చెందిన శ్రీధర్ జిమ్ చేసి ఇంటికి వచ్చిన కొద్ది సేపటికి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. ఆయన గతంలో జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందారు.మృతుడి తండ్రి మానుకొండ రాధాకిశోర్ గతంలో కాంగ్రెస్ నాయకుడు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా పనిచేశారు. శ్రీధర్ ఆయన రెండో కుమారుడు. శ్రీధర్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అటు ఖమ్మం అల్లీపురంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నిన్న ఉదయం గుండెపోటుతో గరికపాటి నాగరాజు ఇదే విధంగా మృతి చెందారు. కుటుంబసభ్యులతో సరదా గడిపి అన్నం తినేందుకు కూర్చుకున్న నాగరాజు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.ఆసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు చనిపోయాడు.గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలతో నాగరాజు చనిపోయినట్లు తెలిపారు వైద్యులు. నాగరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో నాగరాజు కుటుంబంలో విషాదం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com