Karimnagar : నన్ను చంపి నా భూమిలో నుండి రోడ్డు వేయండి ..రైతు ఆవేదన

Karimnagar : నన్ను చంపి నా భూమిలో నుండి రోడ్డు వేయండి ..రైతు ఆవేదన
X

జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డుకోసం భూమి ఇవ్వమని రైతులు నిరసన తెలిపారు రైతులు. నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు ఈడ్చుకెళ్లారు.కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన కానిగంటి కుమార్ అనే రైతు, జాతీయ రహదారి–563 నిర్మాణం కోసం తన భూమి ఇవ్వనని, మార్కెట్లో ఒక గుంటకు రూ.10 లక్షలు ఉండగా అధికారులు కేవలం రూ.63 వేలు మాత్రమే ఇస్తున్నారని రైతు ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు తన భూమిలో రహదారి పనులను ప్రారంభించారని, నోటీసులు లేకుండా పనులు ఎలా చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగి పనులను అడ్డుకున్నాడు రైతు. దీంతో పోలీసులు కుమార్ ను అరెస్టు చేయగా,అధికారులు పనులు కొనసాగించారు. మానకొండూరు మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని, ఇంత తక్కువ పరిహారానికి భూములు ఎలా ఇస్తామని అధికారులను రైతులు నిలదీస్తున్నారు.

Tags

Next Story