TG : కిషన్‌రెడ్డి తెచ్చింది సున్నా.. పొన్నం ఫైర్
హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన పొన్నం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. గతంలో టూరిజం మంత్రిగా ఉన్న ఆయన నగరానికి ఒక్క రూపాయి తీసుకురాలేదని విమర్శించారు.
తెలంగాణ బడ్జెట్‌లో హైదరాబాద్ మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ''హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్‌రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలి. ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరానికి రూపాయి తీసుకురాలేని వాళ్లకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు. కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది. " అని అన్నారు పొన్నం.
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టే.. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా నిరసన తెలుపుతున్నామన్నారు పొన్నం. కాంగ్రెస్ హయాంలోనే పూర్తయిన ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలు మళ్లిస్తామన్నారు. కేటీఆర్ కాళేశ్వరానికి విహార యాత్రకు వెళ్లారని సెటైర్లు వేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com