Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కిషన్ రెడ్డి సవాల్

కొంతమంది సన్నాసులు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని. అలాంటి వారిని పట్టించుకోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు ఏం చేశామో చర్చకు సిద్ధమని, ఎక్కడికి రమ్మన్నా వస్తామని బీఆర్ఎ స్, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా.. పార్టీ కార్యకర్తలే నిజమైన లీడర్ అని స్పష్టం చేశారు. 'రాష్ట్రంలో అన్నిరకాల సమస్యలకు రెండు పార్టీలే కారణం. సన్నాసులు కొంతమంది మాపై ఆరోపణలు చే స్తున్నారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. సచివాలయానికైనా, ట్యాంక్ బండ్ కెనా, వరంగల్, కరీంనగర్ ఎక్కడికైనా వస్త్రం. దోచు కున్నాది మీరు... ఆరోపణలు మాపై చేస్తారా. మేం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరితో కుమ్మక్కు కాలేదు.. మేం ప్రజలతో కుమ్మక్కు అవుతాం. రేవంత్ రెడ్డి, కేసీఆర్ దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. పనికిరానటువంటి నేతలకు జవాబు చెప్పం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల లో బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది. మా పార్టీ అధ్యక్షుడు ఎవరు కావాలో మేం నిర్ణయిం చుకుంటాం. ప్రత్యర్థి పార్టీలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు' అని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com