ప్రజల్ని భయపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు : కిషన్‌రెడ్డి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకుంటోందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రజల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల సమయంలోనూ ఇలాగే చెప్పారని గుర్తుచేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం గుర్తించాలని అన్నారు.
అటు.. బుధవారం బీజేపీలో చేరిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కిషన్‌రెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్... టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌లో గుర్తింపు లేదని అన్నారు. ఏ ఆత్మగౌరవం కోసం పోరాటం చేశామో.... అదే లేకుండా పోయిందని స్వామిగౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన వాళ్లు.. ఉద్యమకారుల్ని అవమానించారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com