Kishan Reddy : ఎంపీల సమావేశానికి వెళ్లడం లేదు: కిషన్ రెడ్డి

Kishan Reddy : ఎంపీల సమావేశానికి వెళ్లడం లేదు: కిషన్ రెడ్డి
X

అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకావొద్దని బీజేపీ డిసైడ్ అయ్యింది. ఇప్పటికే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలతో తాము రాలేకపోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ ఆహ్వానం ఆలస్యంగా అందిందని, పార్టీలో తమకు చర్చించుకునే సమయం దొరకలేదని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే, ముందుగానే తమకు తెలియజేయాలని కోరారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తూనే ఉంటామని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 17 మంది ఎంపీలుండగా.. కాంగ్రెస్, బీజేపీ చెరో 8 మంది ఎంపీలు, ఎంఐఎం ఒక్క ఎంపీగా ఉన్నారు.

Tags

Next Story