Kishan Reddy : రైతు భరోసా కోసం అప్లికేషన్లు ఎందుకు? నిలదీసిన కిషన్ రెడ్డి

Kishan Reddy : రైతు భరోసా కోసం అప్లికేషన్లు ఎందుకు? నిలదీసిన కిషన్ రెడ్డి
X

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతోంది ప్రజాప్రభుత్వం కాదని, అది ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వమని, కోతల ప్రభుత్వమని మండిపడ్డారు. రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు కుట్రచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు ఎందరో ప్రభుత్వం వద్ద సమగ్ర సమచారం ఉన్నా.. రైతు భరోసా సాయం కోసం రైతులు నుండి దరఖాస్తులు తీసుకోవడమెందుకు అని ప్రశ్నించారు. రుణమాఫీ పెట్టినట్లే రైతు భరోసాకు కూడా కోతలు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద అక్రమ కేసులు పెడుతూ వారికి సంకెళ్లు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల చేతులకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సంకెళ్లు వేస్తే... నేడు కాంగ్రెస్ సర్కారు కూడా అదే పనిచేస్తోందని దుయ్య బట్టారు. ఈ మేరకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Tags

Next Story