TG : తెలంగాణలో ఏరియల్ సర్వే చేయండి.. కేంద్రానికి కిషన్ రెడ్డి రిక్వెస్ట్

TG : తెలంగాణలో ఏరియల్ సర్వే చేయండి.. కేంద్రానికి కిషన్ రెడ్డి రిక్వెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో ఎంత మేరకు విపత్తు జరిగిందో తెలుసుకోడానికి ఏరియల్ సర్వే చేయించాలని కేంద్రమంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రులు కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం బృందం సర్వే చేయనుందని తెలిపారు.

వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించడానికి బీజేపీ ఇద్దరు నేతలతో రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ఈనెల 8తేదీన రెండు బృందాలు వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో సంకినేని వెంకటేశ్వరరావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటిస్తారని చెప్పారు. ఎంపీ ఈటల నేతృత్వంలో మహబూబాబాద్, ములుగు ప్రాంతాలలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రామారావు పాటిల్ పర్యటిస్తారని వివరించారు.

తెలంగాణలో ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగం, మం జూరుపై రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ప్రస్తు తం మోడీ ప్రభుత్వంలోని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. కేంద్ర హోంశాఖ మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు.

Tags

Next Story