Kishan Reddy రేవంత్, కేసీఆర్ మక్కీ టు మక్కీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy రేవంత్, కేసీఆర్ మక్కీ టు మక్కీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

ముఖ్యమంత్రి రేవంత్, రెడ్డి, కేసీఆర్ ను పాలో అవుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మాదిరిగా నే అబద్ధాలతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా రని ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తన మాటలను రేవంత్ రెడ్డికి, తన కుమారుడు కేటీఆర్ కు బదిలీ చేశారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రమే పైసలు ఇస్తోందని, రాష్ట్ర యంత్రాం గంతో కొనిపించేందుకు ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏమిటని ప్రశ్నించారు. వరి, పసుపు, పత్తి సహా 10 పంటలకు బోనస్ ఇస్తామని ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, దానిని బోగస్ చేసిందని విమర్శించారు. రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కనీసం 15 పైసలు కూడా ఇవ్వడం లేద న్నారు. కౌలు రైతులది, వ్యవసాయ కూలీలదీ అదే పరిస్థితి అన్నారు. ఇవాళ సన్న ధాన్యా నికి మాత్రమే రూ. 500 బోనస్ ఇస్తామని చెబుతున్నారని, అవికూడా ఇచ్చే శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్ర తలు క్షీణించాయని, ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పల ఊబిలోకి కూరుకుపోతోందని, పెట్టుబడులు వచ్చే పరిస్థితే లేదని అన్నారు. రియల్ ఎస్టేట్ కుదేలైందని, వ్యాపారాలు మం దగించాయని చెప్పారు. బీఆర్ఎస్ 15 నోటిఫి కేషన్లు ఇచ్చి ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటఫికేషన్ ఇవ్వకుం డా యాభైవేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెబు తోందని అన్నారు. లగచర్లలో చర్చలతో జర పాల్సిన ప్రభుత్వం కలెక్టర్ మీద దాడుల వరకు తీసుకొచ్చిందన్నారు. మంత్రుల బృందాలను కేటీఆర్ అరెస్టును కేంద్రం అడ్డకోవడం లేదు కేటీఆర్ అరెస్టును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందనేది పూర్తిగా అవాస్త వమని కిషన్ రెడ్డి చెప్పారు. గవర్నర్ ఏ సంతకం పెడుతున్నారనేది కేంద్ర పర్య వేక్షించదని అన్నారు. ఎవరైనా, ఏదైనా ఊహించుకోవచ్చని అన్నారు. ఏర్పాటు చేసి ఆవేదనను అర్థం చేసుకొని భూ సేకరణ చేయాలని అన్నారు. కలెక్టర్ మీద దాడులు జరగడం.. రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపడం చూస్తుంటే తెలంగాణ ఎక్క డికి పోతోందనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ ఏ ఒక్కటే.. రెండు పార్టీల లీడర్లు ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నా రని అన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.

Tags

Next Story