TG : సీఎంపై కోమటిరెడ్డి కామెంట్స్.. తీవ్రంగా పరిగణించిన క్రమశిక్షణ కమిటీ

మంత్రి పదవి దక్కలేదని ఆగ్రహంతో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వంపై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఇవాళ రాజగోపాల్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది.
ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదని.. కానీ, నియోజకవర్గ ప్రజల కోసమే మునుగోడు నుంచి పోటీ చేసినట్లు కోమటిరెడ్డి అన్నారు. ‘‘పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నారు. భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే పదవి ఇస్తామన్నారు. పదవి ఇస్తారా? ఇవ్వరా? అనేది పార్టీ హైకమాండ్ ఇష్టం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు.. మంత్రి పదవులు ఇస్తున్నారు. మంత్రి పదవి నాకోసం కాదు.. మునుగోడు ప్రజల కోసం.. పదవి కోసం ఎవరి కాళ్లు మొక్కాల్సిన అవసరం నాకు లేదు’’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com