KA Paul : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కావొచ్చు : కేఏ పాల్

ముఖ్యమంత్రి కావడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అన్ని అర్హ తలు ఉన్నాయని ప్రజాశాంతి చీఫ్ కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని తనకు ఫిర్యాదులు వస్తు న్నాయని తెలిపారు. నల్గొండలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్ మాట్లాడుతూ 'కేటీఆర్ తప్పులు చేస్తే అరెస్టు చేయండి. కానీ రాజకీయ కక్షతో కాదు. వందల మంది తప్పులు చేశారు. మోసం చేశారు. వాళ్లను రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. ఆర్ కృష్ణయ్యలాంటి మంచి నేత కూడా బీజేపీకి సపోర్ట్ చేయడం బాధాకరం.గత పాలకులు, ప్రస్తుత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, నారిటీలు ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో బీజేపీ లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పా ర్టీలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కోమటి రెడ్డి బ్రదర్స్ ప్రజాశాంతి పార్టీలో చేరాలి. తగ్గేదే లే..నా ప్రాణం పోయేంతవరకు ప్రజల కోసం సేవ చేస్త. వారం రోజుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను పర్యటించి ప్రజాశాంతి పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్త' అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com