Konda Surekha : సీఎంతో కొండా దంపతుల భేటీ.. పంచాయితీ క్లోజ్ అయినట్టేనా.

సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా జరిగిన వివాదాల నేపథ్యంలో కొండా సురేఖ, కొండా మురళి దీపావళి రోజున సీఎం ఇంటికి వచ్చారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఉన్నారు. కొండా దంపతులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వరుస వివాదాలపై వీరితో మాట్లాడినట్టు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కొండా దంపతులు చేసిన ఆరోపణలు, సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఇష్యూ.. వీటితో పాటు సుష్మిత చేసిన ఆరోపణలపై కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు కొంత కాలంగా సీరియస్ గానే ఉన్నారు.
కొండా సుష్మిత ఆరోపణల తర్వాత మీనాక్షితో మంత్రి సురేఖ భేటీ అయ్యారు. అదే రోజు కేబినెట్ భేటీ ఉన్నా సరే ఆమె హాజరు కాలేదు. అప్పటి నుంచి ఆమె సైలెంట్ గానే ఉంటోంది. మీడియా ముందుకు కూడా పెద్దగా రావట్లేదు. మీనాక్షి నుంచి సురేఖకు సీరియస్ ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. మీడియాకు దూరంగా ఉండాలని, ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ గా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అదే టైమ్ లో సురేఖను మంత్రి పదవి నుంచి తీసేస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. వీటన్నింటి నేపథ్యంలో పంచాయితీని క్లోజ్ చేసుకునేందుకే కొండా దంపతులు నేరుగా పండుగ పూట సీఎం ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ భేటీలోనే అన్ని వివాదాలపై మాట్లాడారంట. ఇప్పటి వరకు జరిగిన వాటిపై మాట్లాడి.. భవిష్యత్ లో తీసుకోబోయే నిర్ణయాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఎలాంటి వివాదాలు పెట్టుకోకుండా కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి ప్రస్తుతం ముందున్న సవాళ్లను వివరించి, వాటి గురించి పాటుపడాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఇక్కడితోనే కొండా దంపతుల వివాదం ముగిసిపోయినట్టే అని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వేటి గురించి సురేఖ మాట్లాడాలి, వేటి గురించి మాట్లాడొద్దు అనే అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ భేటీ గురించి కొండా దంపతులు ఏమంటారో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com