TG : రఘునందన్ మాల.. సోషల్ మీడియా వైరల్.. కొండా సురేఖ కంటతడి..

TG : రఘునందన్ మాల.. సోషల్ మీడియా వైరల్.. కొండా సురేఖ కంటతడి..

మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూనే బోరున విలపించారు. నేతన్నలు చేసిన నూలు మాలను ఎంపీ రఘునందన్ తన మెడలో వేయడం మీద తనపై సోషల్ మీడియాలో అసహ్యంగా పోస్టులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కొండా సురేఖ. మహిళను ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా అంటూ కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేటీఆర్.. నీకు చెల్లె లేదా.. ఇలా చేయిస్తారా అంటూ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ కు మ‌హిళ‌లు అంటే చుల‌క‌న, అందుకే ట్రోల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అన్న దుర్మార్గుల పార్టీ బీఆర్ఎస్ అన్నారు. మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వ‌క్రీక‌రించి దారుణంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మ‌హిళా మంత్రుల‌ను, మ‌హిళా నేత‌లు వెంట‌ప‌డి మ‌రీ బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా వేధిస్తోందన్నారు. మహిళలు రాజకీయాల్లో ఉండాలో వొద్దో బీఆర్ఎస్ స్పష్టం చేయాలన్నారు. బీఆర్ఎస్ బికారు నాయ‌కులారా ప‌ద్దతి మార్చుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు సీతక్క.

ఐతే.. మహిళలను గౌరవించడం అందరి బాధ్యతని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రి కొండా సురేఖపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరగడంపై ఆయన స్పందించారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరన్నారు. బీఆర్ఎస్ అయినా, వ్యక్తిగతంగా తానైనా ఇలాంటివి ఉపేక్షించమన్నారు. సోషల్‌ మీడియా వేదికగా జరిగే వికృత చేష్టలను ఖండిస్తున్నాని చెప్పారు. సోషల్‌ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందర్నీ కోరుతున్నానన్నారు హరీశ్‌రావు.

Tags

Next Story