Errabelli Pradeep Rao : కొండా సురేఖ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నియమాలకి విరుద్ధంగా రూ.70 కోట్లు ఖర్చు చేసి తన సతీమణి కొండా సురేఖను గెలిపించానని మాజీ ఎమ్మెల్సీ కొండా ముర ళీధర్ రావు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని ఎన్నికల కమిషన్ కొండ సురేఖ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, వరంగల్ అర్బనో కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా మురళీధర్ రావు తన భార్య కొండా సురేఖ గెలుపు కొరకు 16 ఎకరాలు భూమి అమ్మి 70 కోట్లు ఖర్చు చేశానని సమావేశంలో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. 2023 ఎన్నికల అఫిడవిట్లో తన పేరుమీద ఒక ఎకరం, తన భర్త కొండా మురళి పేరున 13.31 ఎకరాలు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ చూపించారన్నారు. కొండా మురళి మాత్రం తనకు ప్రస్తుతం 500 ఎకరాల భూమి ఉందని 16 ఎకరాలమ్మి రూ. 70 కోట్లు ఖర్చు చేశానని చెప్పారన్నారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యల కు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు సమర్పిస్తానని చెప్పారు. అడ్డదారిలో వరంగల్ తూర్పు నుంచి గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొండ సురేఖ గారు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com