TG : కొండపోచమ్మ హూండీ ఆదాయం రూ‌.8.33లక్షలు

TG : కొండపోచమ్మ హూండీ ఆదాయం రూ‌.8.33లక్షలు
X

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయ హూండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. భక్తులు వివిధ కానుకల రూపంలో అమ్మవారి హూండీలో డబ్బులు వేసి ముడుపులు చెల్లించుకున్నారు. అమ్మవారికి 130 రోజులకు గాను రూ.8,33,393 హూండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఆలయ ఈవో రవి కుమార్, దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ రంగా రావు తెలిపారు. అమ్మవారికి కానుకలు రూపంలో వచ్చిన ఆదాయంను ఆలయ ఖాతాలో జమ చెయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రజీత రమేశ్, డైరెక్టర్ లు చెక్కల నరేశ్, ఆగమల్లు, కోట ఆశయ్య, ఆలయ సిబ్బంది మహేందర్ రెడ్డి, కనకయ్య, పూజారులు మల్లయ్య, లక్ష్మణ్, కొండయ్య, తిరుపతి, గోవర్దన్ ఉన్నారు.

Tags

Next Story