Telangana News : నీటి వాటాలపై సవాళ్లు.. కాంగ్రెస్ అలా.. బీఆర్ ఎస్ ఇలా..

Telangana News : నీటి వాటాలపై సవాళ్లు.. కాంగ్రెస్ అలా.. బీఆర్ ఎస్ ఇలా..
X

కేసీఆర్ చేసిన ఒక్క మాట రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రాజేస్తోంది. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు అన్యాయం జరుగుతోందని మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లతో వివాదం రాజుకుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేసీఆర్ చేసిన కామెంట్లపై అటు రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా స్పందించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే సంతకం పెట్టింది కేసీఆర్ అని.. ఇప్పుడు తమ మీద బురదజల్లడం ఏంటని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని తేల్చేద్దాం అన్నారు. కానీ నిన్న జరిగిన సమావేశాల్లో అలాంటి వాడీ వేడీ చర్చలు ఏమీ కనిపించలేదు. నేడు అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన బీఆర్ ఎస్ పార్టీ.. తెలంగాణ భవన్ లో ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది కృష్ణా జలాల మీద.

ఇంత పెద్ద ఇష్యూను రాజేసిన కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రావట్లేదు. కానీ బీఆర్ ఎస్ నేతలు దాన్ని పెద్ద ఇష్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ మాత్రం తమ మీద ఏ మచ్చ పడకుండా చాలానే జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అటు బీఆర్ ఎస్ కూడా తెలంగాణ భవన్ లో నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. ఇలా రెండు పార్టీలు దీనిపై సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.

చంద్రబాబు కోసమే బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని బీఆర్ ఎస్ అంటోంది. తాము సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసి కొట్లాడుతున్నామని కాంగ్రెస్ చెబుతోంది. బీఆర్ ఎస్ హయంలోనే ఆ నీటి వాటాలపై సంతకాలు పెట్టేసి తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ చెబుతోంది. ఇలా ఎవరి వాదనలు వారివే ఉన్నాయి. మొత్తంగా నీటి వాటాల చుట్టూ రాజకీయం రాజుకుంది. అటు కేంద్రం కూడా దీనిపై కమిటీ వేసింది. మరి ఈ రాజకీయం ఎటువైపు వెళ్తుందో చూడాలి.


Tags

Next Story