KTR : కమీషన్స్ కోసమే మూసీ ప్రాజెక్ట్.. కేటీఆర్ ఆరోపణ

KTR : కమీషన్స్ కోసమే మూసీ ప్రాజెక్ట్.. కేటీఆర్ ఆరోపణ
X

కమిషన్ల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ అంటున్నారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. మూసీ పేరు మీద.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ‌‌, రాబర్ట్ వాద్రాలు డబ్బుల పంచుకుంటారని ఆరోపించారు. రుణమాఫీ కోసం జిల్లా కలెక్టర్లను కలవాలని సీఎం రేవంత్ అనటం దుర్మార్గం అన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొండగల్ లో రైతల భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు. గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్న కాంగ్రెస్ కు హర్యానా ప్రజలు బుద్ది చెప్పారని అక్షేపించారు. సంక్షేమ పథకాల అమలుకు లేని డబ్బులు మూసీ సుందరీకరణకు ఎక్కడవి? అని కేటీఆర్ నిలదీశారు.

Tags

Next Story