KTR: ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ..

KTR: ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ..
మంత్రి కేటీఆర్, దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సే అన్నారు.

మంత్రి కేటీఆర్ ఖమ్మంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.ఈ మేరకు ట్వీట్ చేశారు. ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అంటూ ఫైర్ అయ్యారు. దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సేనన్నారు.స్కాములే తాచుపాములై మీ యూపీఏను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదన్నారు.తమ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదు కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ అంతకన్నా కాదన్నారు. బీజేపీ-కాంగ్రెస్ రెండింటీనీ ఒంటిచేత్తో ఢీకొట్టే ఢీ టీమ్ బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ మిస్ ఫైరింగ్ లో ముమ్మాటికీ కుప్పకూలేది కాంగ్రెస్సేనన్నారు.

లక్ష కోట్లు వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా అంటూ మండిపడ్డారు.అర్థంలేని ఆరోపణలు చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారంటూ ఎద్దేవా చేశారు.భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు.కర్ణాటకలో అన్నభాగ్య హామీని గంగలో కలిపి ఇక్కడ 4 వేల పెన్షన్ అంటే నమ్మేదెవరు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో హామీఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరు.కర్ణాటకలో బీజేపీని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదు మరో ప్రత్యామ్నాయం లేకే ఆ ఫలితం తప్ప అది మీ ఘనత కాదు సమర్థత అంతకన్నా కాదన్నారు.

సమ్మక్క జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడుభూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా అని ప్రశ్నించారు. 4.6 లక్షల ఎకరాలు పంచి అడవిబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న సీఎం కేసిఆర్ అని, నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు జల్ జంగల్ జమీన్ అనే మన్యంవీరుడు కుమ్రంభీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిక సీఎం కేసిఆర్ అని అన్నారు. బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండా మునిగిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కానీ ప్రజల గుండెల నిండా అభిమానం పొందిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు.తొమ్మిదేళ్ల పాలన వెలుగుల ప్రస్థానమని కానీ గత కాంగ్రెస్ పదేళ్ల పాలన చీకటి అధ్యాయమన్నారు. కుమ్ములాటల కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కల్లోలమేనన్నారు.

Tags

Read MoreRead Less
Next Story