KTR : రేవంత్ అల్లుడి కంపెనీ కోసమే ఫార్మా విలేజ్ : కేటీఆర్

KTR : రేవంత్ అల్లుడి కంపెనీ కోసమే ఫార్మా విలేజ్ : కేటీఆర్
X

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్ అని మాజీ మంత్రి కేటీఆర్ఆరోపించారు. సీఎం రేవంత్తోన సొంత అల్లుడు సత్యనారాయ ణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్ అంటూ నాటకాలాడుతున్నా రని ఫైర్అయ్యారు. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లనే లగచర్ల ఘటన జరిగిందన్నారు. తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 'రాష్ట్రంలో సాగుతోంది ఇం దిరమ్మ రాజ్యం కాదు.. ఇందిర ఎమర్జెన్సీ పాలన. కొడంగల్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి భరతం పడుతాం. సీఎం అల్లుడు సత్య నారాయణరెడ్డి, శరత్ల ఫార్మా కంపెనీల ను విస్తరించటం కోసం ప్రభుత్వం సహకరి స్తుంది.. సురేశ్ అనే వ్యక్తి.. బరాబర్ బీఆర్ఎ స్ నాయకుడే. కలెక్టర్ గన్ మెన్లు ఎక్కడ?. ప్రభుత్వ కుట్రకు పోలీస్ ఉన్నతాధికారులు బలికావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతుల పై అక్రమ అరెస్టు జరుగుతుంటే సీఎం ఎక్కడ?. షోలాపూర్ చౌరస్తాలో నిలబడి నా.. రేవంతు ఎవరూ గుర్తుపట్టరు. ఫార్మా విలేజ్ వల్ల వచ్చే లాభమెంటో ముఖ్యమంత్రి చెప్పాలి. రైతులు తిరుపతి రెడ్డికి ఫోన్ చేసి అడిగితే.. తన్ని భూములు తీసుకుంటాము ని హెచ్చరించలేదా? కేంద్ర పెద్దలను నేను కలవటం తప్పు అయితే.. సీఎం గవర్నర్ను కలవటం కూడా తప్పే' అని అన్నారు.

Tags

Next Story