KTR : రాహుల్ గాంధే హైడ్రాను నడిపిస్తున్నారు: కేటీఆర్

KTR : రాహుల్ గాంధే హైడ్రాను నడిపిస్తున్నారు: కేటీఆర్

మంత్రి సురేఖపై జరిగిన ట్రోలింగ్‌తో తమకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘సురేఖ మాపై ఏడుస్తున్నారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని ఆమె అనలేదా? నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా? మా ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పలేకే దాడులకు పాల్పడుతోంది. రేపు ఎల్బీ నగర్‌లో పర్యటిస్తా. ఎవరు ఆపుతారో చూస్తా’ అని మీడియాతో చిట్‌చాట్‌లో సవాల్ విసిరారు. మూసీపై తాను 2-3 రోజుల్లో ప్రెజెంటేషన్ ఇస్తానన్నారు. ఇక రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధే హైడ్రాను నడిపిస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ వెనకుండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నారు. డబ్బుల కోసమే మూసీ ప్రాజెక్టుకు అనుమతిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నోట్ల కట్టలు కావాలి కానీ బాధితుల కష్టాలు పట్టవా? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైంది’ అని మీడియాతో చిట్‌చాట్‌లో విమర్శించారు.

Tags

Next Story