KTR: కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ..

KTR: కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష వైఖరి ప్రదర్శిస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు.తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందని మండిపడ్డారు.9 ఏళ్లుగా తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై అంతులేని వివక్ష చూపించారన్నారు.నదీ జలాల వినియోగం నుంచి మొదలు ప్రాజెక్టుల నిర్మాణం దాకా అన్నింట్లోనూ అడ్డంకులేనన్నారు.9 ఏళ్లయిన కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా డిమాండ్‌ను తేల్చకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు.

పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదన్నారు.కేంద్ర సహాయ నిరాకరణ, వివక్ష ఉన్నా తెలంగాణను ప్రగతి పథంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టామని చెప్పారు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎన్ని విధాలుగా అణచివేతకు ప్రయత్నించినా, తెలంగాణ అభివృద్ధి పట్ల మా నిబద్ధతను, సంకల్పాన్ని అడ్డుకోలేరన్నారు.తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే శక్తుల పైన రాజీ లేకుండా పోరాడతామని చెప్పారు.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలన్నారు‌.

తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో ఈ బహిరంగ లేక రాస్తున్నానని కేటీఆర్‌ అన్నారు.తొమ్మిదేళ్లుగా ప్రధాని తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించే విధంగా పలుమార్లు వ్యాఖ్యానించారన్నారు.తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం నుంచి ఎదురైన అన్ని రకాల ఆటంకాలను దాటుకొని, తనదైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతోందన్నారు.అయితే తెలంగాణ ప్రగతిని, పురోగతిని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం, తన పరిధిలో ఉన్న అంశాలను సైతం తేల్చకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం గత తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తూనే ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story