KTR and Team : రేపు ఢిల్లీకి కేటీఆర్ బృందం!

ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ నేపథ్యంలో రేపు ఢిల్లీకి కేటీఆర్ బృందం వెళ్లనుంది. 2, 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో వారు చర్చించనున్నారు. కేటీఆర్ వెంట వినోద్, దాసోజు శ్రవణ్ కుమార్ వెళ్లనున్నారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో చర్యలకు ఎంత సమయం తీసుకుంటారని సుప్రీం ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ సెక్రటరీ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.
నిన్న అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి క్లారిటీ లేదని, బీసీ డిక్లరేషన్ పేరుతో సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పిందనే విషయాలు ప్రజలకు అర్థమయ్యాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. కులగణన నివేదికతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమైందని తెలిపారు. గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లు రాజకీయాల కోసమేనని అర్థమైందన్నారు. రాహుల్ గాంధీ పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com