KTR : రాష్ట్ర ఆవిర్భావం ఘనంగా జరపాలి .. కేటీఆర్ పిలుపు

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ను ఘనంగా జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ భవన్ లో పార్టీ వ్యవస్థాపక సభ్యులు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి పాల్గొని జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, ఈ వేడుకల్లో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అన్ని జిల్లా కార్యాలయాలతో పాటు నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగరేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలన్నారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారం అయిందని గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సర్కారు కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీ పస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని కేటీఆర్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com