TG Assembly : అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్స్‌తో దుమారం

కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30% కమీషన్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ అసెంబ్లీలో దుమారం రేపాయి. సభలో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేయడంతో సభ మరింత హీట్ ఎక్కింది. పరస్పర కామెంట్లతో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. కేటీఆర్ వ్యాఖ్యలను సభాపతి రికార్డుల నుంచి తొలగించడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అందుకే దాన్ని బంగాళాఖాతంలో వేసి, భూభారతి తెచ్చామని పేర్కొన్నారు. అనేక చట్టాలు, పోరాటాల ద్వారా వచ్చిన భూహక్కులను బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసిందని భట్టి మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com