బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు : కేటీఆర్

టీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. సంవత్సరంలో ప్రతి రోజూ మంచి నీరు సరఫరా చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని జల విహార్‌లో గౌడ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతుందని అన్నారు.
స్థానిక సమస్యల ప్రాతిపదికగా జరగాల్సిన ఎన్నికల్లో కేంద్రమంత్రులు హామీలు ఇస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి కూడా వరద సాయం ఇవ్వలేదని మండిపడ్డారు. దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని అన్నారు. బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆరేళ్లలో కేంద్రం హైదరాబాద్‌కు చేసిన ఒక్క పని చెప్పండి అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com