KTR : చేతకాకున్నా హామీలిస్తారా.. కేటీఆర్ కౌంటర్

KTR : చేతకాకున్నా హామీలిస్తారా.. కేటీఆర్ కౌంటర్
X

చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు? అధికా రంలోకి రాగానే మాటతప్పడమెందుకు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల వేల బీరాలు పలికిన సీఎం ఇప్పుడు నేల చూపు లు చూస్తున్నారని ఇవాళ 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు.

రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. అర చేతిలో బెల్లం పెట్టి మోచేతినినాకిస్తు న్నారని విమర్శించారు. కౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వలేమని కుండ బద్దలు కొట్టారని ఆరోపించారు. మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారని, నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని, నేడు కౌలురైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా? అని ప్రశ్నించారు. ఈ వెన్నుపోటుకు సీఎం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Tags

Next Story