KTR : ఢిల్లీ నుంచి ఒక్క రూపాయీ తేలేదు: కేటీఆర్

సీఎం రేవంత్ 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని, కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదని కేటీఆర్ విమర్శించారు. ‘ ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావ్. నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్లపై సమీక్ష కూడా లేదు. హామీల అమలు చేతగాక గాలి మాటలు, గబ్బు కూతలు. జాగో తెలంగాణ జాగో’ అని ట్వీట్ చేశారు.రాహుల్ గాంధీతోనీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం.. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి ఊడితే మాకేంటి తెలంగాణకు ఒరిగేది ఏంటి అని ప్రశ్నించారు. గ్రామ గ్రామాన గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అంటూ విమర్శించారు. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు హామీల అమలు చేతగాక గాలి మాటలు గబ్బు కూతలు కూస్తున్నారని.. జాగో తెలంగాణ జాగో అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com