KTR : హైడ్రా ఆఫీస్ ముందు కూల్చాలి.. కేటీఆర్ ఎటాక్

KTR : హైడ్రా ఆఫీస్ ముందు కూల్చాలి.. కేటీఆర్ ఎటాక్

వంద రోజుల్లో చేస్తామన్న పనులను 300 రోజులు దాటినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదన్నారు. మూసీ పరివాహక ప్రజల పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు చెప్తున్నారని పేదలు అడుగుతున్నారన్నారు. కూల్చుతామని ఎన్నికల ముందు చెప్పారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కూల్చాల్సి వస్తే ముందు హైడ్రా కార్యాలయాన్ని కూల్చాలన్నారు కేటీఆర్.

అంతకుముందు అత్తాపూర్‌లోని మూసీ నిర్వాసితులను బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరామర్శించారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను కలిసి మాట్లాడారు. బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అత్తాపూర్ హైదర్‌గూడ లక్ష్మి నగర్‌లో కేటీఆర్‌ పర్యటించారు. మాజీ మంత్రి కేటిఆర్ తో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు మల్లారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డి, రాకేష్, కౌశిక్ రెడ్డి, బల్కా సుమన్, శమీపూర్ రాజు తదితరులు అత్తాపూర్‌లో పర్యటించారు.

Tags

Next Story