KTR : రేవంత్ సీఎం కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు: కేటీఆర్

తనపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. ‘సురేఖ దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇప్పటికే పరువు నష్టం దావా వేశా. సీఎం రేవంత్‌పైనా వేస్తా’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సమంత విడాకులతో పాటు టాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి కేటీఆర్ కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అక్టోబర్ వచ్చినా మాఫీ చేయలేదన్నారు. రేవంత్ బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. సీఎం మనుషులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com