KTR : ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన.. కేటీఆర్ లేటెస్ట్ కౌంటర్లు

KTR : ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన.. కేటీఆర్ లేటెస్ట్ కౌంటర్లు
X

వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన ప్రాజాపాలన కార్యక్రమంపై BRS అధ్యక్షుడు కేటీఆర్‌ తనదైన శైలిలో విరుచుపడ్డారు. అది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అని విమర్శించారు. అందులో ఆర్భాటం ఎక్కువ, పరిష్కారం తక్కువంటూ విమర్శించారు.

జీతం రావటం లేదని అడిగితే ఓ ఉద్యోగిని ఉద్యోగం నుంచి పీకేశారన్నారు కేటీఆర్. ప్రజావాణి లో ఫిర్యాదు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అలా ఫిర్యాదు చేసిన రేణుకను ఉద్యోగంలోంచి తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎస్‌ ను డిమాండ్‌ చేశారు.

ఇప్పటివరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎంతమంది పేదలకు ప్రజాదర్బార్ వల్ల సమస్యలు పరిష్కారం అయ్యాయో శ్వేతపత్రం ప్రచురించాలని కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా కోరారు.

Tags

Next Story