KTR: విప్లవంలా హైదరాబాద్ అభివృద్ధి

విప్లవంలా హైదరాబాద్ అభివృద్ధి జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై కేటీఆర్ సమీక్షించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పురపాలక శాఖ సాధించిన విజయాలు, అభివృద్ధి నివేదికను విడుదల చేశారు. అనంతరం ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చుదిద్దుతామని తెలిపారు. తొమ్మిదేళ్లలో పురపాలక శాఖ ద్వారా లక్షా 21 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వాలు 26వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారని తెలిపారు. ఈ పదేళ్లలో పురపాలక శాఖ కోసం 462శాతం ఎక్కువ నిధులు ఖర్చు చేశామన్నారు. హైదరాబాద్‌లో అన్ని ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని ప్రకటించారు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేతకు విధివిధానాలు రూపొందించాల్సిన మంత్రి కేటీఆర్ అవసరం ఉందన్నారు.
ఇక వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వారాంతం నుంచి హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరిన మంత్రి.. అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com