CM Revanth Reddy : కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ గుట్టు విప్పుతా : సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే మాజీ మంత్రి కేటీఆర్ బండారం బయటపెడ్తానని, ఆయన దుబాయ్ ఫైల్స్ గుట్టు విప్పుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడి నుంచి అన్ని రికార్డులు తెప్పించానని చెప్పారు. దుబాయ్ లో కేటీఆర్ మిత్రుడు చనిపోతే శవాన్ని కూడా ఇండియాకు తేనీయలేదని అన్నారు. అక్కడికి వెళ్లి మరీ అంత్యక్రియలు చేశారని చెప్పారు. తాము యువత భవిష్యత్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చిత్త శుద్దితో పని చేస్తుందని, ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల అధికారంలో చేసిందా? అని ప్రశ్నించారు. ‘అప్పట్లో జన్వాడ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీలో ఎవరు దొరికారు.. మొన్నటికి మొన్న మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన కోడి పందాలు, క్యాసినోలో ఎవరు దొరికారు'అని సీఎం ప్ర శ్నించారు. దీపావళి పండుగ రోజు అందరూ టపాసులు కాల్చుతుంటే, వీళ్లు మాత్రం ఫాంహౌస్ లో కొకైన్, డ్రగ్స్, మందు పార్టీలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేస్తే.. మా బామ్మర్ధి ఇంటికి వెళ్లారా అంటూ కేటీఆర్ అడుగుతున్నారని, డ్రగ్స్ పార్టీలు చేసుకుంటే పోలీసులు ఎందుకు వెళ్లకూడదన్నారు. 'నీ బామ్మర్ది కళ్లల్లో ఆనందం కోసం నువ్వు ఏమైనా చేయొచ్చు..అంతేకానీ తెలంగాణ గడ్డపై ఇలాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం క్షమించదు, ఉపేక్షించదు' అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com