KTR : సూర్యాపేటకు కేటీఆర్.. జగదీశ్ రెడ్డికి భరోసా

సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉండి కేవలం సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు జగదీష్ రెడ్డి మాత్రమే గెలవడం, ఆయన అసెంబ్లీ నుంచి సస్పెండ్ కావడంతో ఆయనకు మద్దతుగా ఈ పర్యటనకు నిర్ణయించారు కేటీఆర్. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేటీఆర్ తొలి సమావేశాన్ని సూర్యాపేట జిల్లాలో నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి పక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్లో ప్రశ్నించే గొంతుకగా జగదీష్ రెడ్డి అసెంబ్లీలో పోరాటం చేస్తున్న క్రమంలో అధికార పార్టీ కట్టడి చేసేందుకు ఇటీ వల బడ్జెట్ సమావేశాల్లో సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో జగదీష్ రెడ్డికి పార్టీ మొత్తం అండగా ఉందన్న సందేశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కూడా ఉపయోగపడుతుందని జిల్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు తమ భవిష్యత్ పోరాటాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలన్న నిర్ణయంతో కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com