KTR : కేటీఆర్కు ట్వీట్లు చేసుడు తప్ప ఏమీ చేతకాదు : ఎంపీ చామల
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తెలంగాణలో పర్యటించి వాస్తవాలను జరిగిన నష్టాన్ని తెలుసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద వెంటనే రాష్ట్రానికి ప్యాకేజ్ ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా కేటీఆర్ కు పట్టదని, యువరాజు కేటీఆర్, ఎలన్ మాస్క్ ఎక్స్ ప్లాట్ ఫామ్ మీద ఉండి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ట్వీట్లు చేసుడు తప్ప ఏమీ చేతకాదని, ఎక్స్ లో మెసేజ్ లు పెట్టి నవ్వుల పాలు అవుతున్నారన్నారు. హైడ్రాపై ప్రజలను తికమక పెట్టడానికి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ఒత్తిడి వచ్చినా రేవంత్ రెడ్డి హైడ్రాను ముందుకెళ్తారని చెప్పారు. హైదరాబాద్ లో లేక్స్ ను కాపాడుతామని సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టో లో పెట్టారని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com