TG : సీఎం రేవంత్ పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హౌలేగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలతో విమర్శించారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు? హనుమకొండలో నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. హిందీ తెలంగాణ వారికి అర్థం కాదనుకున్నాడేమో.. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలయ్యాయనడం పచ్చి అబద్ధమన్నారు. బోనస్ రైతులకు ఇంకా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తిదారుల గొంతు కోశారని విమర్శించారు. కొత్త పథకాల మాట దేవుడెరుగు.. ఉన్న పథకాలకే పాతరేశారని మండిపడ్డారు. కులగణనలో 175 ప్రశ్నలు అడుగుతున్నారన్నారు. కులగణన కోసం వెళ్లిన అధికారులను ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు కేటీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com