KTR : గతేడాది మాకు గడ్డు కాలం :కేటీఆర్

గత సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డు కాలమని, పార్టీ స్థా పించిన పాతికేళ్లలో ఇంతటి దయనీయ స్థితి ఎప్పుడూ రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిం డెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో రసమయి బాల కిషన్ రూపొందిం చిన 'నమ్మి నానబోస్తే' షార్ట్ ఫిల్మ్ ను ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడా రు. సంవత్సర కాలంలో ఏం జరిగిందో కండ్లకు కట్టినట్టు చూపించారని అన్నారు. 'అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయాం.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. ఎమ్మెల్సీ కవితను ఐదు నెలలు జైల్లో పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాలేదు. పది మంది ఎమ్మెల్యే లు పార్టీ మారారు. పార్టీ స్థాపించిన పాతికేళ్లలో ఇంతటి దయనీయ స్థితి ఎప్పుడూ రాలేదు'అని
కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య 1.8% ఓట్ల తేడా మాత్రమే ఉందని అన్నారు. బీఆర్ఎస్ పోరాడే తత్వాన్ని కోల్పోలేదని చెప్పారు. అధికారం మాత్రమే కో ల్పోయిందని, అసెంబ్లీలో ప్రజల సమస్యలను లేవనెత్తుతామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజల్లో అభిమానం తగ్గలేదని అన్నారు. ఈ మధ్యే సర్వే రిపోర్టులు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ పై ఏడాదిలోనే వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. గాంధీభవన్ బోసిపోయిందని, తెలంగాణ భవన్ కళకళలాడుతోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com