TG : కేటీఆర్ కు శిక్ష తప్పదు ... పక్కా ప్లాన్ ప్రకారమే దాడి : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

లగచర్ల దాడి ఘటన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ కు శిక్ష తప్పదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధి కారులపై దాడి ఘటనలో ఆయనే మొదటి ముద్దాయి అని చెప్పారు. పక్కా ప్లాన్ ప్ర కారమే కలెక్టర్ పై, కడా ప్రత్యేక అధికారిపై దాడి జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా దానిని అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని అన్నారు. అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్ అణువణువునా ఉందన్నారు. స్థాని కంగా భూములు లేనివారు కలెక్టర్ పై దాడి చేశారని చెప్పారు. లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని వివరించారు. ఈ విషయాన్ని పోలీసులు ని ర్ధారించారని చెప్పారు. దాడి ఘటనలో ఎవ రున్నా వెంటనే అరెస్టు చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. వచ్చే నెల 2,3 తేదీల్లో బహిరంగ సభ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 2 లేదా 3వ తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ నెల 16 నుంచి తాను ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్న ట్టు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లాతో తన పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నట్టు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com