KTR : సినారెకు అక్షర నివాళులు... తెలంగాణ ఆణిముత్యం అని కీర్తించిన కేటీఆర్...

బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె జయంతి సందర్భంగా పలువురు రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. తన అక్షర జ్ఞానం తో తెలుగు భాష అభివృద్ధి కి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. తెలుగు సాహితీ వినీలాకాశంలో ఆయనొక ధృవతార. కవిగా, సాహితీ వేత్తగా, అధ్యాపకుడిగా, సినీ గేయ రచయిత గా ఆయనకు ఆయనే సాటి..
సింగిరెడ్డి నారాయణ రెడి జయంతి సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనను గుర్తు చేసుకున్నారు. ప్రపంచ సాహితీ లోకానికి మన తెలంగాణ గడ్డ అందించిన ఆణిముత్యం సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని అభిప్రాయ పడ్డారు. తన రచనలతో తెలుగు చలనచిత్ర రంగంలో సరికొత్త బాణీని సృష్టించారు. జ్ఞానపీఠ్ అవార్డు తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వారిని వరించినా, రాజ్యసభ ఎంపీతో పాటు ఎన్నో గొప్ప పదవులను వారు అలకరించినా.. ఇవన్నీ సినారె సాహితీ సేవ ముందు దిగదుడుపుగా మిగిలిపోయాయి. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు అక్షర నివాళులు అర్పిస్తున్నాను" అని మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ లో రాసుకొచ్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com