​​KTR : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి: కేటీఆర్ నివాళులు..

​​KTR : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి: కేటీఆర్ నివాళులు..
X

తెలంగాణసాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదికగా ఐలమ్మ త్యాగాలను స్మరించుకున్నారు.

"వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు!" కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తికి చాకలి ఐలమ్మ నిదర్శనమని పేర్కొన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పుకణికగా ఐలమ్మను అభివర్ణించారు. భూమి కోసం, భుక్తి కోసం ఆమె చేసిన తిరుగుబాటు ప్రజా వ్యతిరేక పాలనపై దండయాత్రకు సమానమని గుర్తు చేశారు. బహుజన చైతన్యానికి, మహిళా ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ పోరాటాలను, త్యాగాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని కేటీఆర్ తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజలు చాకలి ఐలమ్మ కు నివాళులు అర్పిస్తున్నారు.

Tags

Next Story