KTR : ఫిరాయించిన చోట బైఎలక్షన్ పక్కా.. కేటీఆర్ జోస్యం

KTR : ఫిరాయించిన చోట బైఎలక్షన్ పక్కా.. కేటీఆర్ జోస్యం
X

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరలో వేటు పటడం ఖాయమన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై ఏ క్షణమైన కోర్టు తీర్పు రావోచ్చని అన్నారు. తొందర్లోనే స్టేషన్‌ఘన్‌ పూర్‌కు ఉప ఎన్నిక రాబోతుందనీ.. అక్కడ బీఆర్‌ఎస్ నుంచి రాజయ్య గెలవబోతున్నారని కేటీఆర్ అన్నారు.

KCR హయంలో కరెంటు పోతే వార్త.. ఇప్పుడు కరెంట్‌ ఉంటే వార్తలని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా చెడు జరిగితే కేసీఆర్ ఖాతాలోనూ.. మంచి జరిగితే తమ ఖాతాలోనూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేసుకుంటోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కేసీఆర్ త్వరలో జనాల్లోకి వెళతారని కేటీఆర్ స్పష్టం చేశారు.

Tags

Next Story