KTR : మహిళలను కించపరిచే ఉద్దేశం లేదు: కేటీఆర్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కాచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అని ట్వీట్ చేశారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
రాష్ట్రంలో మనిషికో బస్సు వేయాలని, అప్పుడు ఫ్యామిలీలకు ఫ్యామిలీలు పొయ్యి అందులో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. మహిళా ప్రయాణికులనుద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా సమాజం భగ్గుమంది. కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com