TG : కొండా సురేఖపై కేటీఆర్ రూ.100 కోట్ల దావా.. పిరికిపందలను వదిలేది లేదని కౌంటర్

TG : కొండా సురేఖపై కేటీఆర్ రూ.100 కోట్ల దావా.. పిరికిపందలను వదిలేది లేదని కౌంటర్
X

మంత్రి కొండా సురేఖ పై తాను వేసిన క్రిమినల్ పరువు నష్టం ధావాపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వం పైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని చెప్పారు. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇప్పటిదాకా ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా.. ఇక పైన మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు కేటీఆర్. రాజకీయ విమర్శల పేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖ పై వేసిన 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలన్నారు.

Tags

Next Story