KTR : కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ సంచలన ప్రకటన

KTR : కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ సంచలన ప్రకటన
X

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్క్ కేటీఆర్ క్యాంపెయిన్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎక్స్ వేదికగా సమాధానం ఇచ్చారు కేటీఆర్. కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం ఏంటని ఓ నెటిజన్ ప్రశ్నించగా కేటీఆర్ జవాబు ఇచ్చారు. కేసీఆర్ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. పార్టీ కార్యక్రమాల విషయంలో తమకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని అన్నారు. 2025 తరువాత కేసీఆర్ ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగోలేవని, ప్రజా జీవితంలో నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఒకనొక దశలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని కేటీఆర్ రిప్లయ్ ఇచ్చారు. ప్రజల కోసం నిలబడి పోరాడుతున్నానని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story