TG : రేవంత్‌కు కేటీఆర్ ఆగస్టు 2 డెడ్ లైన్.. పంప్‌హౌజ్‌లు ప్రారంభించాలి

ఆగస్ట్ 2 లోగా కన్నెపల్లి పంప్ హౌజ్ లు ప్రారంభించకపోతే.. 50 వేల మంది రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణకు గుండె లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం వినియోగించడం లేదన్నారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనలో ప్రభుత్వంలో నిప్పులుచెరిగింది.
కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద పరిస్థితులను పరిశీలించిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనంత గొప్పగా ముందు చూపుతో కాళేశ్వరంను కేసీఆర్ నిర్మించారు. బహుళార్థ ప్రయోజనాల లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. అత్యంత ఎత్తైన 618 అడుగుల కొండపోచమ్మ సాగర్ వరకు నీరు వెళ్లే విధంగా డిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కామధేనువు లాంటిది. ఎగువ గోదావరి నుంచి దిగువన ఉన్న కాళేశ్వరం వరకు పరిశీలించాము. కరవు పీడిత ప్రాంతాల కోసం కాళేశ్వరం కట్టాము. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయవచ్చా అధికారులను అడిగి తెలుసుకున్నాం. కాళేశ్వరం విషయంలో రాజకీయాలు చేయకండి అని గతంలో ప్రభుత్వానికి చెప్పాము. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసుకోవచ్చు. నీరు ఉంది కానీ లిఫ్ట్ చేసేందుకు రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల జరగడం లేదు’ అని చెప్పారు కేటీఆర్.
"నాలుగున్నర ఏళ్ళు ప్రజల కోసం పని చేద్దాం. పంపులు ప్రారంభించండి రాజకీయాలు మానండి. పంపులు ప్రారంభిస్తారా లేదా?. అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు గదువునిస్తున్నాం. అగస్టు 2వ తేదీలోపు పంపులు ప్రారంభించకపోతే.. 50 వేల మంది రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే మేమే వచ్చి పంప్ హౌజ్ లను ఆన్ చేస్తాం.’ అని కేటీఆర్ హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com